![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -86 లో..... రామరాజుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వస్తారు. స్టేషన్ లో భద్రవతిని చూసి రామరాజు షాక్ అవుతాడు. ఆ తర్వాత రామరాజు కుటుంబంలో అందరికి విషయం తెలిసి అందరూ స్టేషన్ కి వస్తారు. ఎందుకు మా నాన్నని అరెస్ట్ చేశారని ధీరజ్ అడుగుతాడు. భద్రవతి గారి మేనకోడలు నగలు మీ నాన్న దొంగతనం చేశారు.. అందుకే అని సీఐ చెప్తాడు. మా నాన్న దొంగతనం చెయ్యడమేంటి వదిలెయ్యండి అని అందరు అడుగుతారు.
నేనే అసలైన నేరస్తుడిని.. నిన్ను కన్నాను కదా అందుకే అని రామరాజు చిరాకుగా ధీరజ్ తో మాట్లాడతాడు. భద్రవతి చెప్పగానే సీఐ అందరికి బయటకు వెళ్ళమని చెప్తాడు. భద్రవతి వెళ్తుంటే వేదవతి మాట్లాడుతుంది. నా వాళ్ళ నా అక్క జీవితం అలా అయిందని చాల బాధపడ్డాను కానీ ప్రతీక్షణం మా కుటుంబం చెడిపోవాలని చూస్తావంటూ వేదవతి ఎమోషనల్ అవుతుంది. బంధం గురించి నువ్వు మాట్లాడకంటూ భద్రవతి కోప్పడుతుంది. అందరు రాత్రి అయిన స్టేషన్ ముందే కూర్చొని ఉంటారు.
ధీరజ్ బాధపడుతూ మా నాన్నకి భోజనం ఇస్తానంటూ కానిస్టేబుల్ ని రిక్వెస్ట్ చేస్తాడు. వద్దని అతను అంటాడు. ప్రేమని ధీరజ్ పక్కకు తీసుకొని వెళ్లి మాట్లాడతాడు. నువ్వు ఎవడితోనో లేచిపోతే మీ వాళ్ళు ఏం అవుతారోనని మా అమ్మ నా చేత నీ మెడలో తాళి కట్టించింది. ఇప్పుడు చూసావా ఏం చేసారోనని ధీరజ్ ఎమోషనల్ అవుతాడు. దాంతో ప్రేమ బాధపడుతూ.. తన ఇంటికి వెళ్తుంది. భద్రవతి కళ్ళు మూసుకొని ఉంటుంది . ప్రేమ వచ్చావా అని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |